![]() |

జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన బుల్లి తెర నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు ఆడియన్స్ కి, చానెల్స్ కి సెలెబ్రిటీగా మారిపోయాడు. వరుస షోస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల్లోని సింగింగ్ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చేందుకు అంకితమైన "సూపర్ సింగర్ జూనియర్ షో" సక్సెస్‌ఫుల్ గా నడుస్తోంది. ప్రతీ వారం ఒక కొత్త థీమ్ తో ఈ షో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో "పల్లెటూరికి, పట్నం జోరుకు మధ్య రసవత్తర పోరు" పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతోంది.
ఈ ఎపిసోడ్ లో సుధీర్, అనసూయ కామెడీ వేరే లెవెల్లో ఉంది. పిల్లలు కూడా ఈ ఎపిసోడ్ లో అద్భుతమైన సాంగ్స్ పాడి అందరినీ మైమరిపించారు. ఇక ఈ ఎపిసోడ్ లో పిల్లలతో పాటు సుధీర్ కూడా తన గొంతు కలిపాడు. ఇందులో జడ్జిగా ఉన్న లెజెండరీ సింగర్ చిత్రమ్మతో కలిసి సాంగ్ షేర్ చేసుకున్నాడు. "అందం హిందోళం" అనే పాటను తనదైన స్టైల్ లో సూపర్ గా పాడి జడ్జెస్ కూడా ఇంప్రెస్ చేసేసాడు సుధీర్. అందరూ ఆ పాట విని షాక్ అయ్యారు.
ఇక హేమచంద్ర ఐతే సుధీర్ సాంగ్ కి ఫిదా ఐపోయి "సుధీర్ బ్రో.. ఐ ఆమ్ ఆల్రెడీ ఏ ఫ్యాన్ ఆఫ్ య ..ఇక నీ డెడికేషన్ కి ఇంకా పెద్ద ఫ్యాన్ ఇపోయా" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. సాంగ్ తర్వాత చిత్రమ్మ కాళ్లకు దణ్ణం పెట్టాడు సుధీర్. జూనియర్ సింగర్స్ అంతా స్టేజి మీదకు వచ్చేసి సుధీర్ ని హగ్ చేసేసుకున్నారు. "సుధీర్ చాలా హార్డవర్క్ చేశారు. దాని కోసం అందరూ ఒక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి" అని అన్నారు చిత్ర. అలా సుధీర్ తన గానంతో, గాత్రంతో అందరినీ అలరించాడు. అంతా లేచి నిలబడి క్లాప్స్ కొట్టి మరీ సుధీర్ ని అభినందించారు.
![]() |